జీవితంలో అనుకొని పరిస్థితుల కారణంగా ఓటమి అంచుల్లో కూరుకుపోయిన ఓ వ్యక్తి.. తనకు బాగా ఇష్టమైన క్రికెట్ ను ప్రాణంగా భావించి, మళ్లీ జీవితంలో ఎలా గెలిచాడు.. ? ఆ గెలిచే క్రమంలో అతను ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు.. అనే పాయింట్ బేస్ చేసుకొని నాని హీరోగా గౌతం తిన్ననూరి దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘జెర్సీ’ .
కాగా జెర్సీ సినిమాలో హీరో గెలిచే క్రమంలో పడే ఇబ్బందులను అదిగిమించడానికి చేసే ప్రయత్నంలో వచ్చే పాటే ‘స్పిరిట్ ఆఫ్ జెర్సీ’ సాంగ్. ఈ ఇన్స్పిరేషన్ సాంగ్ ను కొద్దిసేపటి క్రితమే చిత్రబృందం సోషల్ మీడియాలో విడుదల చేసింది. అయితే సాంగ్ ప్రస్తుతం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటూ వైరల్ గా మారుతుంది.
ఇక జెర్సీ చిత్రం నుండి ఇటీవలే వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల అయిన ‘అదేంటోగాని ఉన్నపాటుగా’ అనే సాంగ్ కూడా నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ చిత్రానికి తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం అందిస్తుండగా ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై నిర్మాత సూర్య దేవర నాగ వంశి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.


