‘మా’ ఎన్నికల్లో రికార్డ్ పోలింగ్ !

‘మా’ ఎన్నికల్లో రికార్డ్ పోలింగ్ !

Published on Mar 10, 2019 4:34 PM IST

Maa

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఈ రోజు జరుగుతున్న విషయం తెలిసిందే. శివాజీరాజీ, నరేష్‌ ప్యానళ్లు ఎన్నికల్లో పోటీపడుతున్నాయి. కాగా ఎన్నికల్లో ఈ సారి పోలింగ్ బాగా జరుగుతుందట. ‘మా’ ఎన్నికల్లో ఇప్పటివరకు అత్యధికంగా 423 నుండి 433 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. కానీ ఈసారి మాత్రం 472 దాటి 500 దాకా పోలింగ్ నమోదైందని తెలుస్తోంది.

కాగా నరేష్ ప్యానల్‌ నుంచి వైస్‌ ప్రెసిడెంట్‌ గా హీరో రాజశేఖర్‌, జనరల్‌ సెక్రటరీగా జీవిత పోటీలో నిలవగా.. శివాజీరాజా ప్యానల్‌ నుంచి శ్రీకాంత్‌, ఎస్వీ కృష్ణారెడ్డి తదితరులు పోటీలో పడుతున్నారు.

తాజా వార్తలు