ఏపి ఎన్నికల్లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రభావం 70 శాతం !

ఏపి ఎన్నికల్లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రభావం 70 శాతం !

Published on Mar 12, 2019 4:55 PM IST

lakshmi NTR

రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తో సోషల్ మీడియాలో బాగానే హడావుడి చేస్తున్నాడు. వెన్నుపోటు పాటతో మొదలు పెట్టి ఆ తరువాత టీజర్, ట్రైలర్ లతో వివాదాలకు బాగానే పునాది వేశాడు ఆర్జీవీ. అంతటితో ఆగకుండా సోషల్ మీడియాలో కూడా చంద్రబాబు మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తూ సినిమాకి బాగానే హైప్ క్రియేట్ చేస్తున్నాడు.

కాగా తాజాగా ఎన్టీఆర్ చివరి రోజుల్లోని సంఘటనల పరిస్థితుల ఆధారంగా తీసిన ఈ చిత్రం ఏపీలో రాబోయే ఎన్నికల ఫలితాల పై ప్రభావం చూపుతుందా అని వర్మ తన ట్విట్టర్లో పోల్ పెట్టాడు, దాంతో ఆ పోల్ కు కేవలం రెండు గంటల్లోనే 11 వేలకి పైగా ఓట్లు నమోదయ్యాయి. పైగా 70 శాతం మంది నెటిజన్లు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఏపి ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని ఓట్ వేయడం నిజంగా విచిత్రమే.

తాజా వార్తలు