ది ప్యారడైజ్ : వాడి జడల్‌ని ముట్టుకుంటే వాడికి సర్రుమంటది.. హైప్ పెంచుతున్న కీర్తి సురేష్..!

ది ప్యారడైజ్ : వాడి జడల్‌ని ముట్టుకుంటే వాడికి సర్రుమంటది.. హైప్ పెంచుతున్న కీర్తి సురేష్..!

Published on Aug 27, 2026 8:00 PM IST

న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమా నుంచి సెకండ్ సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పక్కా తెలంగాణ ఫోక్ సాంగ్ ‘ఏశ నాగుల కట్ట మీద’ను ఈ సెకండ్ సింగిల్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

దీంతో సోషల్ మీడియాలో ఈ పాటపై అప్పుడే అదిరిపోయే అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. తాజాగా ఈ పాటపై మరింత హైప్ పెంచుతూ నటి కీర్తి సురేష్ ఓ పోస్ట్ చేసింది. నాని ‘జడల్’ని ఆమె పట్టుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..”వాడి జడల్ని ముట్టుకుంటే వాడికి సర్రుమంటది…” అంటూ కీర్తి చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

‘దసరా’ చిత్రంలో నాని-కీర్తి సురేష్ జోడీ ఎంతటి మ్యాజిక్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నానితో కలిసి ఈ స్పెషల్ సాంగ్‌లో కీర్తి చిందులు వేయనుంది. దీంతో వీరిద్దరి కెమిస్ట్రీని మరోసారి వెండితెరపై చూసేందుకు అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు