‘బొమ్మరిల్లు’ లాంటి సినిమాతో రానున్న అఖిల్ !

‘బొమ్మరిల్లు’ లాంటి సినిమాతో రానున్న అఖిల్ !

Published on Mar 17, 2019 10:33 PM IST

అక్కినేని అఖిల్ ఎన్నో జాగ్రత్తలు తీసుకోని చేసిన ‘మిస్టర్ మజ్ను’ మంచి అంచనాల మధ్య విడుదలై, ఆ అంచనాలను తలక్రిందుల చేస్తూ.. మిక్సడ్ రివ్యూస్ కే పరిమితమైంది. దాంతో అఖిల్ తన తరువాత సినిమా పై మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. తన తర్వాత సినిమాని బొమ్మరిల్లు భాస్కర్ తో చేయబోతున్నాడు. ఈ సినిమాలో బొమ్మరిల్లు సినిమాలో లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు లవ్ స్టోరీ కూడా సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందట.

కాగా ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నే నిర్మించనుందని తెలుస్తోంది. అఖిల్ తన తరువాత సినిమా కోసం చాలామంది డైరెక్టర్స్ దగ్గర కథలు విని చివరికి భాస్కర్ తో ఫిక్స్ అయ్యాడు. మరి భాస్కర్ తో చెయ్యబోయే సినిమాతోనైనా అఖిల్ భారీ విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు