యంగ్ హీరో సరసన లేడీ సూపర్ స్టార్ ?

యంగ్ హీరో సరసన లేడీ సూపర్ స్టార్ ?

Published on Mar 17, 2019 11:00 PM IST

vijaydevara

తమిళ్ సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ గురించి ఓ న్యూస్ హల్ చల్ చేస్తోంది. విజయ్ దేవరకొండ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార నటించబోతుందని ఆ న్యూస్ సారాంశం. ఇదే న్యూస్ ఇటీవలే తెలుగులో మీడియాలో కూడా బాగానే హల్ చల్ చేసింది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గాని.. ప్రస్తుతం ఈ న్యూస్ అయితే కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది.

ప్రముఖ నిర్మాత ఎస్.ఆర్ ప్రభు నిర్మాణంలో ఓ నూతన దర్శకుడి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ – నయనతార సినిమా తెలుగు మరియు తమిళ్ భాషల్లో రాబోతుందని సమాచారం. కథ ప్రకారం విజయ్ సరసన నయనతార అయితేనే ఆ పాత్రకు సూట్ అవుతుందట. మొత్తానికి నయనతారకు జోడిగా విజయ్ దేవరకొండ అనేసరికి నెటిజన్లలో కూడా ఈ వార్త పై ఆసక్తి పెరుగుతుంది. కాగా ఇంతకీ ఈ వార్తకు సంబధించి ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

తాజా వార్తలు