చిత్రలహరి ఫస్ట్ సాంగ్ తో ఇంప్రెస్ చేసిన దేవి !

చిత్రలహరి ఫస్ట్ సాంగ్ తో ఇంప్రెస్ చేసిన దేవి !

Published on Mar 19, 2019 7:00 PM IST

Chitralahari2

కిషోర్ తిరుమల దర్శకత్వంలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ నటిస్తున్న తాజా చిత్రం ‘చిత్రలహరి’ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతుంది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం యొక్క టీజర్ కు భారీ రెస్పాన్స్ రాగ తాజాగా ఈ చిత్రం నుండి ‘పరుగు పరుగు’ అనే మొదటి సాంగ్ ను విడుదలచేశారు. ఇక ఈ పాట పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంటుంది. రొటీన్ గా కాకుండా దేవి అందించిన ఈ సాంగ్ ట్యూన్స్ చాలా ఫ్రెష్ గా వున్నాయి. అంతేకాకూండా ఈ సాంగ్ లిరిక్స్ కూడా ఆయనే రాశాడు.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తేజు సరసన కళ్యాణి ప్రియదర్శన్ ,నివేత పేతురాజ్ కథానాయికలుగా నటిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈచిత్రం ఏప్రిల్ 12న విడుదలకానుంది.

సాంగ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు