మన్మథుడు 2 షూటింగ్ షురూ కానుంది !

మన్మథుడు 2 షూటింగ్ షురూ కానుంది !

Published on Mar 27, 2019 10:04 PM IST

Manmadhudu 2

కింగ్ నాగార్జున , ‘చి ల సౌ’ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ కలయికలో తెరకెక్కనున్న చిత్రం మన్మథుడు 2 ఇటీవలే లాంచ్ అయ్యింది. ఇక ఈ చిత్రం యొక్క షూటింగ్ రేపు హైదరాబాద్ లో స్టార్ట్ కానుంది. అయితే ఎక్కువ భాగం షూటింగ్ అంత యూరప్ లో జరుగనుందని సమాచారం. ఇక ఈ చిత్రంలో నాగ్ కు జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ నటించనుంది. వీరిద్దరు కలిసి నటించడం ఇదే మొదటి సారి.

అల్ టైం సూపర్ హిట్ మూవీ మన్మథుడు కి సీక్వెల్ గా రానున్న ఈ చిత్రానికి ఆర్ఎక్స్ 100 ఫేమ్ చైతన్ భరద్వాజ్ సంగీతం అందించనున్నాడు. నాగార్జున సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మించనుంది.

తాజా వార్తలు