రవితేజ సినిమా ఖాతాలో మరో అరుదైన ఫీట్!

రవితేజ సినిమా ఖాతాలో మరో అరుదైన ఫీట్!

Published on Aug 27, 2026 5:05 PM IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే ‘ఇరుముడి’. మంచి బజ్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్ అయ్యింది. అయితే ఈ చిత్రం సృష్టిస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు.

తెలుగు రాష్ట్రాల్లో అంతకంతకు కొత్త రికార్డులు ఈ చిత్రం సెట్ చేస్తూ వెళుతుంది. అయితే వర్కింగ్ రోజుల్లోకి వచ్చాక కూడా రీజనల్ సినిమాల్లో ‘ఇరుముడి’ మరో అరుదైన ఫీట్ ని సెట్ చేసినట్టుగా మేకర్స్ తెలిపారు. ఈ సోమవారం, మంగళ, బుధవారాల్లో అత్యధికంగా టికెట్ సేల్స్ జరుపుకున్న రీజనల్ సినిమాగా అది కూడా ఎలాంటి పండుగ సీజన్లో కాకుండా రికార్డు సెట్ చేసినట్టు మేకర్స్ తెలిపారు.

ఇది మాత్రం రవితేజ కెరీర్లోనే కాకుండా టోటల్ టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ ఫీట్ అని చెప్పవచ్చు. ఇక ఈ హవా అంతా ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు