నరేంద్ర మోదీ బయోపిక్ విడుదల వాయిదాపడింది !

నరేంద్ర మోదీ బయోపిక్ విడుదల వాయిదాపడింది !

Published on Apr 5, 2019 9:28 AM IST

modibiopic

భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘పిఎం నరేంద్ర మోదీ’ విడుదల వాయిదాపడింది. ఈచిత్రం ఈరోజు విడుదలకావల్సిన ఉండగా అనివార్య కారణాల వల్ల విడుదలకావడం లేదని ,త్వరలోనే కొత్త విడుదలతేది ని ప్రకటిస్తామని చిత్ర నిర్మాతల్లో ఒకరైన సందీప్ సింగ్ తెలిపారు. ‘సరబ్జిత్ , మేరీ కోమ్’ బయోపిక్ ల దర్శకుడు ఒమంగ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ , మోదీ పాత్రలో నటించగా బోమన్ ఇరానీ ,దర్శన్ కుమార్ ముఖ్య పాత్రలు పోషించారు.

సురేష్ ఒబెరాయ్ , సందీప్ సింగ్ ,ఆనంద్ పండిట్ ,ఆచార్య మనీష్ సంయుక్తంగా నిర్మించారు. ఈ బయోపిక్ లో మోదీ బాల్యాన్ని అలాగే ప్రధాన మంత్రి గా ఎదిగిన విషయాలను చూపించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు