విజయ్ దేవరకొండ , రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం డియర్ కామ్రేడ్. ఇటీవల ఈచిత్రం యొక్క టీజర్ విడుదలకగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ రోజు రష్మిక బర్త్ డే సందర్భంగా ఈచిత్రంనుండి ఆమె లుక్ ను విడుదలచేశారు. ఈ సినిమాలో రష్మిక లిల్లి పాత్రలో క్రికెటర్ గా కనిపించనుంది. ఈ చిత్రం లోని మొదటి సాంగ్ ను ఈనెల 8న ఉదయం11:11 గంటలకు విడుదలచేయనున్నారు.
భరత్ కమ్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ , బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తుండగా మే 31న ఈచిత్రం సౌత్ లోని అన్ని భాషల్లో విడుదలకానుంది.


