మజిలీకి మంచి పాజిటివ్ టాక్ రావడం, దానికి తోడు సినిమాలో చైతు నటన సినిమాకే హైలెట్ నిలవడంతో మొత్తానికి పెళ్లి తర్వాత చైతు నటనలో పరిణితి చెందాడు అంటున్నారు అక్కినేని అభిమానులు. సినిమాలో ఒక యంగ్ క్రికెటర్ గా నటించిన చైతు చాలా ఫ్రెష్ గా కనిపిస్తూ.. ఆ ఏజ్ లో ఉండే ఆ ఆవేశాన్ని తన కళ్ళలో చూపిస్తూ చైతు నటించిన విధానం నిజంగా చాలా బాగుంది.
అలాగే భార్య మీద ప్రేమ లేని భర్తగా.. ఏ పని చెయ్యని భగ్న ప్రేమికుడిగా కూడా చైతు చక్కగా నటించాడు. గత తన సినిమాల్లో కంటే మజిలీలో ఇటు యంగ్ క్యారెక్టర్ లో అటు తాగుబోతు భర్త క్యారెక్టర్ లో నాగ చైతన్య జీవించేశాడు అని చెప్పాలి. తన రెండు అవతారాల్లోనూ చైతన్య సూపర్, చాలా బావున్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
మొత్తానికి ఈ సమ్మర్ కి పెద్ద సినిమాలు అరడజనుకు పైగానే ఉన్నాయి. ముందుగా మజిలీ మంచి హిట్ తో ప్రారంభం అయింది. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం చాలా భావోద్వేగంతో గుండెకు హత్తుకునే విధంగా ఉంది. ఇక ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించగా నటి దివ్యంశ కౌశిక్ ముఖ్య పాత్రలో నటించింది.


