మరో థ్రిల్లర్ తో రానున్న నయన్ !

మరో థ్రిల్లర్ తో రానున్న నయన్ !

Published on Apr 7, 2019 2:00 PM IST

nayana3

వరస విజయాలతో లేడీ సూపర్ స్టార్ నయనతార కెరీర్ ప్రస్తుతం పీక్స్ స్టేజ్ లో వుంది. ఈఏడాది ప్రారంభంలో విశ్వాసం తో బ్లాక్ బ్లాస్టర్ హిట్ కొట్టిన ఆమె కు ఐరా షాక్ ఇచ్చింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం అనుకున్నంతగా విజయం సాధించలేకపోయింది. ఇక నెలన్నర గ్యాప్ లో మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రం తో ప్రేక్షకుల ముందుకు రానుంది నయనతార. ఆమె నటించిన తాజా చిత్రం కొలైయుధీర్ కాలం. ఈ చిత్రం మే 10న కానీ 17న కానీ విడుదలకానుందని సమాచారం. మరి ఈ చిత్రం కూడా తెలుగులో డబ్ అవుతుందో లేదో చూడాలి.

ఇక ఈ సినిమా కాకుండా నయనతార ఈఏడాది మరో మూడు సినిమాలతో ప్రేక్షకులముందుకు రానుంది. అందులో భాగంగా ‘మిస్టర్ లోకల్’ మే 1న విడుదలకానుండగా ‘సైరా ,తలపతి 63’ వంటి బడా చిత్రాలు ఈ ఏడాది ద్వితీయార్థం లో విడుదలకానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు