ఐదుగురు అమ్మాయిలతో ’90 ఎం.ఎల్’ !

ఐదుగురు అమ్మాయిలతో ’90 ఎం.ఎల్’ !

Published on Apr 7, 2019 3:28 PM IST

90ml

తమిళంలో ’90 ఎం.ఎల్’ ఆ సినిమా విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలుగులో ఈ సినిమాకి టైటిల్ ’90 ఎం.ఎల్’. ట్యాగ్ లైన్ “ఇది చాలా తక్కువ” అని పెట్టారు. కాగా ఇప్పుడు ఈ సినిమాని కర్ణ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకం పై పఠాన్ చాంద్ బాషా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

కాగా ఈ చిత్రం టీజర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా పఠాన్ చాంద్ బాషా మాట్లాడుతూ.. ఐదుగురు అమ్మాయిల చుట్టూ తిరిగే కథాంశంతో ’90 ఎం.ఎల్’ అనే సినిమా రాబోతుందని.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని తెలిపారు.

తమిళ్ హీరోయిన్ ఓవియా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది. అలాగే తమిళ హీరో శింబు కూడా ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో నటించాడు. ఇక ఓవియాతో పాటు మరో నలుగురు అమ్మాయిలు కూడా ఈ సినిమాలో నటించారు. ఓవియా నటించిన రొమాంటిక్ సన్నివేశాలు యూత్ ను బాగా ఆకట్టుకునేలా ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు