పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్ తాజాగా ‘అలీతో సరదాగా’ ప్రోగ్రాంకు అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా అలీ అడిగిన ప్రశ్నలకు రేణు దేశాయ్ పలు ఆసక్తి కరమైన సమాధానాలు చెప్పారు. అలీ రేణు దేశాయ్ తో మీకు ‘రేణు’ అనే పేరు ఇష్టం లేదంట కదా నిజమేనా..? అని అడగగా.. రేణు సమాధానమిస్తూ.. ‘నిజమే.. నా పేరు అంటే నాకు అస్సలు ఇష్టం లేదు. రేణు ఏంటి ఛీ.. అదేదో రేవతినో లేదా రేవనో అని పెడితే బావుండేది కదా’ అని తెలిపింది.
అలాగే ఆమె జానీ, ఖుషీ సినిమాలకు ఎడిటర్ గా పని చేసారు. అయితే ఆ సినిమాలకు రెమ్యునరేషన్ విషయంలో ఆమె స్పందిస్తూ.. ‘జానీ, ఖుషీ సినిమాలకు నేను ఎడిటర్ గా పని చేశాను. కానీ ఆ సినిమాలకు నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని.. దానికి సాక్ష్యం పవన్ కళ్యాణ్ గారని ఆమె చెప్పుకొచ్చింది.


