సూపర్ హిట్ మూవీ ‘సోగ్గాడే చిన్నినాయనా’ కు సీక్వెల్ గా బంగార్రాజు అనే చిత్రం తెరకెక్కనుందని తెలిసిందే. ఈ చిత్రానికి స్క్రిప్ట్ కూడా ఓకే అయిపోయిందట. ఇక ఈ చిత్రంలో నాగ్ కు జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార ను తీసుకుందామనుకున్నారు. ఇటీవల నయన్ కు కలిసి డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ స్టోరీ లైన్ ను కూడా వినిపించాడట. అయితే నయనతార ప్రస్తుతం సైరా , తలపతి 63, దర్బార్ వంటి బడా సినిమాల్లో నటిస్తుండంతో ఈ సినిమా కి డేట్స్ అడ్జెస్ట్ చేయలేనని చెప్పేసిందట.
దాంతో ఈ చిత్రం కోసం మరో సీనియర్ హీరోయిన్ జ్యోతిక ను తీసుకోవాలనుకుంటున్నారట. త్వరలోనే ఈ చిత్రంలో నటించే హీరోయిన్ ఎవరనేది క్లారిటీ రానుంది. ఇక నాగ్ ప్రస్తుతం మన్మథుడు 2 లో నటిస్తున్నాడు. జూలై లో ఈ సినిమా ను పూర్తి చేసి ఆగస్టు నుండి బాంగ్రారాజు ను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు.


