ఆకాశవాణి షూటింగ్ పూర్తి చేసిన తమిళ నటుడు !

ఆకాశవాణి షూటింగ్ పూర్తి చేసిన తమిళ నటుడు !

Published on Apr 11, 2019 11:00 PM IST

Akashavani

రాజమౌళి కుమారుడు కార్తికేయ ప్రస్తుతం ఆకాశవాణి అనే సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. 5కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నినూతన దర్శకుడు అశ్విన్ గంగరాజు డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రముఖ తమిళ నటుడు సముద్రఖని ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఇక తాజాగా ఆయన తన పాత్ర తాలూకు షూటింగ్ ను పూర్తి చేశాడు.

దాదాపుగా అందరు కొత్త వారే నటిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి తనయుడు కాల బైరవ సంగీతం అందిస్తుండగా ప్రముఖ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ చిత్రం విడుదలకానుంది.

తాజా వార్తలు