స్టార్ హీరో సూర్య నటిస్తున్న ‘కాప్పాన్’ విడుదల తేదీ ని ఫిక్స్ చేసుకుంది. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు 30న విడుదలకానుంది. కెవి ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ , బోమన్ ఇరానీ , ఆర్య , చిరాగ్ జానీ ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా ఆర్య సతీమణి సయేశా సైగల్ కథానాయికగా నటిస్తుంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈచిత్రానికి హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. ఇక నిన్న విడుదలైన ఈ చిత్రం యొక్క టీజర్ సూపర్ రెస్పాన్స్ ను రాబట్టి సినిమా ఫై భారీ అంచనాలను క్రియేట్ చేసింది.
ఇక ఈసినిమా కంటే ముందు సూర్య ,ఎన్ జి కె తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. మే 31న ఈచిత్రం విడుదలకానుంది. ప్రస్తుతం సూర్య ,సుధా కొంగర డైరెక్షన్లో సురరై పోట్రు అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం కూడా ఈ ఏడాది చివర్లో విడుదలకానుంది


