టాక్సిక్ ఎఫెక్ట్ : రవితేజ సొంత థియేటర్‌లో ‘ఇరుముడి’ కంటే ఎక్కువ షోలు..!

టాక్సిక్ ఎఫెక్ట్ : రవితేజ సొంత థియేటర్‌లో ‘ఇరుముడి’ కంటే ఎక్కువ షోలు..!

Published on Aug 25, 2026 9:32 PM IST

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ప్రస్తుతం సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతుంది మాస్ రాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ చిత్రం. ఇక మరికొద్ది గంటల్లో యష్ ‘టాక్సిక్’ మూవీతో బాక్సాఫీస్ పై దండయాత్రకు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో ‘టాక్సిక్’ చిత్రానికి ఎక్కువ థియేటర్లు కేటాయించడంపై టాలీవుడ్‌లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

అయితే, డిమాండ్ దేనికైతే ఎక్కువ ఉంటుందో ఆ సినిమాకే ఎక్కువ థియేటర్లను కేటాయించడం ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు యష్ ‘టాక్సిక్’ చిత్రానికి ఉన్న హైప్ దృష్ట్యా ఆ చిత్రానికి థియేటర్ల సంఖ్య భారీగా కేటాయించారు. దీంతో ఇరుముడి చిత్రానికి సగానికి సగం థియేటర్లు తగ్గిపోనున్నాయి.

కాగా, ఇందులో మరో విశేషమేమిటంటే.. రవితేజ సొంత థియేటర్ అయిన ART సినిమాస్‌లోనూ టాక్సిక్ చిత్రానికి ఏకంగా 10 షోలు కేటాయించగా, ఇరుముడి చిత్రానికి మాత్రం కేవలం 5 షోలే కేటాయించారు. దీన్నిబట్టి టాక్సిక్ ఎఫెక్ట్ టాలీవుడ్‌లో ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చరు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు