విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్న సినిమా ‘రౌడీ జనార్దన’. ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం మళ్ళీ ప్యాచ్ వర్క్ చేయబోతున్నారు. నిజానికి ఈ సీక్వెన్స్ షూటింగ్ పూర్తి అయినా.. అవుట్ ఫుట్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకూడదనే ఉద్దేశ్యంతో ఈ సీక్వెన్స్ ను భారీ స్థాయిలో మళ్ళీ రీషూట్ చేయాలని రవి కిరణ్ కోలా భావిస్తున్నారట. భారీ స్థాయిలో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.
మొత్తానికి ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తాడట. కాగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అన్నట్టు రాజశేఖర్ పాత్ర అండ్ ఆయన లుక్ మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటుందట. కాగా ఈ సినిమా కథ గ్రామీణ నేపథ్యంలో సాగనుంది. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా కీర్తి సురేశ్ నటించనుంది. మొత్తానికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.


