‘కబీర్ సింగ్’ వసూళ్ల వరదకు ఇప్పట్లో బ్రేక్ పడేలా లేదు.

‘కబీర్ సింగ్’ వసూళ్ల వరదకు ఇప్పట్లో బ్రేక్ పడేలా లేదు.

Published on Jun 30, 2019 10:33 PM IST

kabir

అర్జున్ రెడ్డి సినిమాకు హిందీ రీమేక్‌గా వచ్చిన “కబీర్ సింగ్‌” బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వరదకు ఇప్పట్లో బ్రేక్ పడేలా కనిపించడం లేదు.ఈ శుక్రవారం ఆయుష్మాన్ ఖురానా నటించిన “ఆర్టికల్15”,అలాగే మరో చిత్రం “హమ్ తుమ్ సే ప్యార్ కిట్న” అనే రెండు చిత్రాలు విడుదలయాయి. ఐనాకూడా ఈ మూవీ రెండో వారంలో ఇప్పటివరకూ రూ 163.73 కోట్లు రాబట్టిందని ట్రేడ్‌ అనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ ట్విట్టర్ లో పేర్కొన్నారు .

కేసరి, టోటల్‌ ఢమాల్‌ల లైఫ్‌టైమ్‌ వసూళ్లను అధిగమించి ఈ ఏడాది టాప్‌ 5 హయ్యస్ట్‌ గ్రాసర్స్‌లో మూడో స్ధానంలో నిలిచింది. రూ 150 కోట్ల మార్క్‌ను దాటిన కబీర్‌ సింగ్‌ ఆదివారం రూ 175 కోట్ల వసూళ్ల మైలురాయిని అధిగమించి రెండో వారంలో పద్మావత్‌ కంటే మెరుగైన వసూళ్లు రాబడుతోందని తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు. కబీర్‌ సింగ్‌ త్వరలో భారత్‌, ఉరి మూవీల లైఫ్‌టైమ్‌ బిజినెస్‌ను దాటుతుందని తరణ్‌ ఆదర్శ్‌ అంచనా వేశారు.

తాజా వార్తలు