విజయ్‌ దేవరకొండతో చేద్దామనుకున్నా – శ్రీప‌వార్‌

విజయ్‌ దేవరకొండతో చేద్దామనుకున్నా – శ్రీప‌వార్‌

Published on Sep 4, 2019 7:34 PM IST

శ్రీనిక క్రియేటివ్ వ‌ర్క్స్ ప‌తాకంపై రూపొందుతున్న చిత్రం 2 అవ‌ర్స్ ల‌వ్‌. ఈ చిత్రంతో శ్రీప‌వార్ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఆయ‌నే క‌థ రాసి, ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మిది. కృతి గ‌ర్గ్ క‌థానాయిక‌గా న‌టించారు. త‌నికెళ్ల‌భ‌ర‌ణి, న‌ర్సింగ్ యాద‌వ్‌, అశోక వ‌ర్ధ‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ నెల 6న (శుక్ర‌వారం) విడుద‌ల కానున్న ఈ సినిమా గురించి ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు, హీరో శ్రీ ప‌వార్ విలేక‌రుల‌తో బుధవారం స‌మావేశ‌మ‌య్యారు. శ్రీ ప‌వార్ మాట్లాడుతూ నేను పుట్టింది, పెరిగింది ఇక్క‌డే. ఐటీ జాబ్ చేశాను. ఐదేళ్ల పాటు ఆ ఉద్యోగం చేసి ఇప్పుడు సినిమాల్లోకి వ‌చ్చాను. నాకు బేసిగ్గా ర‌చ‌న – ద‌ర్శ‌క‌త్వం అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే ఏడాదిన్న‌ర పాటు కూర్చుని క‌థ రాసుకున్నా. నేను రాసుకున్న క‌థ విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు చ‌క్క‌గా స‌రిపోతుంద‌నిపించింది. అప్పుడు ఆయ‌న న‌టించిన పెళ్లిచూపులు చూసి అలా ఫిక్స‌య్యా. కానీ ఆయన అంద‌నంత దూరం వెళ్లారు. స‌రేన‌ని నేనే న‌టించ‌డానికి ముందుకొచ్చా.

నాకు రైట‌ర్‌గా, డైర‌క్ట‌ర్‌గా కాంప్ర‌మైజ్ కావ‌డం ఇష్టం లేదు. పైగా నేను సుకుమార్ సినిమాల‌ను ఇష్ట‌ప‌డ‌తాను. ఆయ‌న‌లాగా సీన్స్, ఆయ‌న థాట్ ప్రాస‌స్ నాకు చాలా ఇష్టం. అలాగ‌ని సినిమాల‌ను చూసి కాపీ కొట్ట‌ను. ఒక సినిమాను చూసి కాపీ కొట్టి రాయ‌డం నాకు న‌చ్చ‌దు. మ‌న జీవితంలోని సంఘ‌ట‌న‌ల‌న్నిటినీ స‌మాహారం చేస్తే సినిమా క‌థ అయిపోతుంది. అలా రాసుకుందే ఈ క‌థ‌. దీనికి మొద‌లు ఎక్క‌డ‌, ఏమేం స్ఫూర్తి అంటే చెప్ప‌డం క‌ష్ట‌మేమో.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు