అనిరుధ్, కావ్యల వివాహం.. డేట్, వెన్యూ ఫిక్స్ అయ్యిందా..?

అనిరుధ్, కావ్యల వివాహం.. డేట్, వెన్యూ ఫిక్స్ అయ్యిందా..?

Published on Aug 17, 2026 9:55 PM IST

సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారంటూ మళ్లీ రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ నవంబర్ 10న గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది.

అయితే గతంలో జూన్ 2025లో వచ్చిన ఇలాంటి పెళ్లి పుకార్లపై అనిరుధ్ స్పందిస్తూ.. వీటిలో ఎలాంటి నిజం లేదని, ఊహాగానాలను ప్రచారం చేయడం ఆపాలని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్ కుమార్తె అయిన కావ్య మారన్, ఐపీఎల్ మ్యాచ్‌ల్లో సందడి చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

మరోవైపు అనిరుధ్ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో వరుస భారీ ప్రాజెక్టులతో సౌత్ ఇండియాలోనే మోస్ట్ బిజీ మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరి పెళ్లికి సంబంధించిన వార్తలు నెట్టింట మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి.

తాజా వార్తలు