ముంబైలో అడుగుపెట్టిన చిరు

ముంబైలో అడుగుపెట్టిన చిరు

Published on Sep 27, 2019 9:15 PM IST

chiru2

‘సైరా’ హిందీ విడుదలను చరణ్, చిరంజీవిలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో తెలిసిన సంగతే. సినిమా మొదలైనప్పటి నుండే హిందీ పరిశ్రమతో చర్చలు జరుపుతూ భారీ రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే థియేటర్ల కేటాయింపు ఒక కొలిక్కి రావడంతో ప్రమోషన్ల మీద దృష్టి పెట్టారు.

మెగాస్టార్ చిరంజీవి కొద్దిసేపటి క్రితమే ముంబై చేరుకున్నారు. మెగా టీమ్ అక్కడ భారీ ఈవెంట్ ఒకటి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ ప్రచార కార్యక్రమాల్లో అమితాబ్ సైతం పాల్గొనే అవకాశాలున్నాయట. చిరుకి బాలీవుడ్ కొత్తేమీ కాదు. కానీ చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఎంట్రీ ఇస్తుండటంతో ఆయన కూడా ఎగ్జైట్ అవుతున్నారు.

ట్రైలర్ బాగా ఆకట్టుకోవడం, చిత్రంలో అమితాబ్ కీ రోల్ చేయడంతో హిందీ ప్రేక్షకుల్లో సినిమా పట్ల అమితాశక్తి ఉంది. పైగా తెలుగు భారీ చిత్రాలకు అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో ఓపెనింగ్స్, వసూళ్లు భారీగా ఉంటాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు