వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘కొరియన్ కనకరాజు’ తొమ్మిదవ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. స్వాతంత్య్ర దినోత్సవ సెలవు నాడు ఈ హారర్ కామెడీ చిత్రం టికెట్ల అమ్మకాలు రెట్టింపు అయ్యాయి. స్వాతంత్య్ర దినోత్సవం రోజున బుక్‌మైషో మరియు డిస్ట్రిక్ట్ ప్లాట్‌ఫామ్‌లలో కలిపి ఈ సినిమా టికెట్లు సుమారు 56 వేలకు పైగా అమ్ముడుపోయాయి. ఈ డిమాండ్ కారణంగా పలు ప్రదేశాల్లో అదనపు షోలను ఏర్పాటు చేశారు. ఎలాగూ ఈ రోజు ఆదివారం, కాబట్టి ఈ రోజు కూడా టికెట్ల అమ్మకాలు ప్రోత్సాహకరంగా కొనసాగుతున్నాయి.
ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా యంగ్ హీరోయిన్ రితికా నాయక్ వరుణ్ తేజ్ సరసన నటించింది. ఈ చిత్రంలో సత్య, శ్రీనివాస్ అవసరాల, మురళీధర్ గౌడ్, చిన్న తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి యువి క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. అన్నట్టు ఈ సినిమాకి లాంగ్ రన్ లో కూడా మంచి కలెక్షన్స్ రావడం నిజంగా విశేషమే. ముఖ్యంగా బిసి సెంటర్స్ లో ఈ సినిమాకి బాగా డిమాండ్ ఉంది.


