భారీ అంచనాలతో ప్రతిష్టాత్మకంగా విడుదల అవుతున్న సైరా పై అంచనాలు మాములుగా లేవు. చిరంజీవి మొదటిసారి స్వాతంత్ర్య సమరయోధుడిగా నటిస్తుండటంతో పాటు, భారీ బడ్జెట్ తో తెరకెక్కి పాన్ ఇండియా మూవీగా వస్తున్న నేపథ్యంలో మెగా అభిమానులతో పాటు, సగటు సినీ ప్రేమికులు చిత్రం కొరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు, యూఎస్ లో కూడా ఈ చిత్రంపై భారీ క్రేజ్ ఉన్నట్లు తెలుస్తుంది. యూఎస్ లో ఈ చిత్ర అడ్వాన్స్ బుకింగ్స్ తీరు చూస్తుంటే ఈ విషయం అర్థం అవుతుంది.
ఇప్పటికే సైరా అడ్వాన్స్ బుకింగ్స్ $ 400000 లకు చేరాయని తాజా సమాచారం. సైరా అడ్వాన్స్ బుకింగ్స్ జోరు చూస్తుంటే వన్ మిలియన్ ఈజీగా చేరుకుంటుందని అంచనా. ఇక నిన్న రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి, తమన్నా టీం బెంగుళూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం జరిగింది. కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఇక దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన సైరా మూవీ అక్టోబర్ 2న విడుదలకు సిద్ధమైంది. సైరా చిత్రానికి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందించారు.


