‘లెనిన్’ సక్సెస్.. అఖిల్ సైలెంట్.. ఎందుకో..?

‘లెనిన్’ సక్సెస్.. అఖిల్ సైలెంట్.. ఎందుకో..?

Published on Aug 16, 2026 12:00 AM IST

‘లెనిన్’ సినిమా భారీ విజయాన్ని సాధించడంతో అక్కినేని అఖిల్ ఊరట చెందారు. ఈ విజయం ఆయనలో కొత్త నమ్మకాన్ని నింపింది. లెనిన్ విడుదలకి ముందే తన నెక్స్ట్ చిత్రం గురించిన ప్రకటన త్వరలోనే ఉంటుందని చెప్పినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరాలనూ వెల్లడించలేదు. ప్రస్తుతం ఆయన రెండు కథలను ఫైనల్ చేశారని, అయితే వాటికి సంబంధించిన ఎలాంటి లీకులు రాకుండా జాగ్రత్త పడుతున్నారని సమాచారం.

ఆ రెండు ప్రాజెక్ట్‌లలో ఒకదాన్ని త్వరలోనే ఖరారు చేసి ప్రకటిస్తారు. ఈ నెలలో రాబోతున్న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా అఖిల్ కొత్త సినిమా ప్రకటన వెలువడే అవకాశం ఉందని టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అఖిల్ తన భార్యతో కలిసి విదేశాల్లో హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు. సెప్టెంబర్ నుంచి కొత్త సినిమా షూటింగ్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

నాగార్జున కూడా ఈ ప్రాజెక్ట్ విషయాలను వ్యక్తిగతంగా పరిశీలిస్తున్నారు. తన నెక్స్ట్ చిత్రాన్ని 2027లో విడుదల చేయాలని అఖిల్ భావిస్తుండగా, దీనికి సంబంధించిన అధికారిక సమచారం త్వరలోనే రానుంది.

తాజా వార్తలు