‘సరిలేరు నీకెవ్వరు’లో మరో స్టార్ హీరోయిన్ ?

‘సరిలేరు నీకెవ్వరు’లో మరో స్టార్ హీరోయిన్ ?

Published on Oct 2, 2019 2:00 AM IST

sari

సూపర్ స్టార్ మహేశ్ బాబు టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ గెస్ట్ రోల్ లో కనిపించనుందట. ఇటీవలే ‘గద్దలకొండ గణేష్’తో మాస్ ఆడియన్స్ ను అలరించిన స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో ఓ గెస్ట్ రోల్ లో నటిస్తుందట. ఇప్పటికే అనీల్ రావిపూడి ఆమెను సంప్రదించాడని.. గెస్ట్ రోల్ కు పూజా హెగ్డే కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి.

కాగా ఈ సినిమాలో మహేశ్ సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. మహేష్ అజయ్ కృష్ణ అనే ఆర్మీ మేజర్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు తో కలిసి అనిల్ సుంకర నిర్మించనున్నారు. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు