నితిన్ ‘ఇష్క్’ సినిమా నుండి ‘గుండెజారి గల్లంతయ్యిందే’ ‘అ ఆ’ సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. కానీ గత మూడు సినిమాలు ‘లై, ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం’ ప్లాప్ లతో మళ్లీ ప్లాప్ ల పరంపరతో సతమతమవుతున్నాడు. అందుకే ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ఎంతో ప్లాన్ గా స్క్రిప్ట్ ను దగ్గరుండి రెడీ చేయించుకోని మరీ చేస్తోన్న సినిమా ‘భీష్మ’. ‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా ‘భీష్మ’ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో కామెడీ చాల బాగా వస్తోందని.. ముఖ్యంగా వెన్నల కిశోర్ అండ్ నితిన్ ట్రాక్ సినిమాలోనే హైలెట్ గా నిలవబోతుందట. మొత్తానికి వెంకీ కుడుముల ‘ఛలో’ మాదిరిగానే ఈ చిత్రాన్ని కూడా ఫుల్ ఎంటెర్టైనింగా మలుస్తున్నాడట.
కాగా ఈ సినిమాలో ఒక కీ రోల్ కోసం హెబ్బా పటేల్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో హెబ్బా పటేల్ రోల్ బాగా బోల్డ్ గా నెగిటివ్ షేడ్స్ తో ఉంటుందని తెలుస్తోంది. ఇక నితిన్ కూడా భీష్మ పై చాలా ఆశలే పెట్టుకున్నాడు. మరి కనీసం ఈ సినిమానైనా నితిన్ ప్లాప్ లకు బ్రేక్ వేస్తోందేమో చూడాలి. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ సరసన మెయిన్ హీరోయిన్ గా రష్మిక మండన్నా నటిస్తోంది. ప్రస్తుతం నితిన్, ‘భీష్మ’తో పాటు వెంకీ అట్లూరి దర్శకుడిగా తెరకెక్కుతున్న రంగ్ దే సినిమాలోనూ అలాగే విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నాడు.


