పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పీక్ క్రేజ్ ఉన్న సమయంలో వచ్చిన చిత్రమే ‘పంజా’. అప్పటికే ప్లాప్స్ ఉన్నాయి కానీ పవన్ క్రేజ్ మాత్రం అంతకంతకు పెరుగుతూనే వచ్చింది. ముఖ్యంగా గ్యాంగ్ స్టర్ డ్రామా పంజా రోజులు అయితే పవన్ ఫ్యాన్స్ మర్చిపోలేరు. ఆ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ హైలైట్స్ ఇప్పటికీ ఒక హాట్ టాపిక్ ఆ రేంజ్ హైప్ లో వచ్చిన సినిమా ఊహించని డిజాస్టర్ గా మిగిలిపోయింది.
అయితే తర్వాత ఆడియెన్స్ లో క్లాసిక్ గా టాక్ తెచ్చుకుంది. ఇక ఫైనల్ గా ఈ సినిమా కూడా రీరిలీజ్ కి రాబోతుంది. ఈసారి పవన్ పుట్టినరోజుకి గ్రాండ్ ప్లానింగ్స్ ఫ్యాన్స్ చేస్తున్నారు. అయితే ఇలా పంజా రీరిలీజ్ కి మాత్రం తెలుగు స్టేట్స్ లో ప్రమోషన్స్ కానీ ప్లానింగ్స్ కానీ క్రేజీ లెవెల్లో జరుగుతున్నాయి. టికెట్స్ కి కూడా క్రేజీ ప్లానింగ్ లు చేస్తూ వాటిని గన్స్, గ్రానెట్స్ రూపంలో డిజైన్ చేసి అమ్ముతున్నారు.
అలాగే గ్రాండ్ రిలీజ్ కి కూడా థియేటర్స్ ని లాక్ చేసుకుంటున్నారు. మరి సినిమా ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో కానీ ఈ పనులు అన్నీ మాత్రం పీక్ లో జరుగుతున్నాయి. సినిమా వసూళ్లు ఎలా ఉంటాయి అనేది ఈ సెప్టెంబర్ 2 తో క్లారిటీ వచ్చేస్తుంది. ఇక ఈ చిత్రానికి విష్ణువర్ధన్ దర్శకత్వం వహించగా ఆర్కా మీడియా వారు నిర్మాణం వహించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.


