`జిల్` చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తోన్న పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్ డేట్ ఇచ్చింది చిత్రబృందం. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను నవంబర్ లో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో పెద్ద సెట్ వేస్తున్నారు. అలాగే ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
కాగా ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఒక షెడ్యూల్ ను ఇటలీలో షూట్ చేశారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే పాత్ర ఓ స్కూల్ టీచర్ గా కనిపించనుండదని.. ఈ సినిమా పీరియాడిక్ మూవీ కావడంతో పూజా గెటప్ కూడా ఆనాటి ట్రెడిషనల్ లేడీ టీచర్స్ పోలి ఉండేలా డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది.
మూడు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్నీ గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2020 చివర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుతానికి అయితే ఈ సినిమాకి టైటిల్ ‘జాన్’ ప్రచారంలో ఉంది.
ఇక అత్యంత భారీ బడ్జెట్ తో హై స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరెకెక్కిన ‘సాహో’ ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించడంలో ఫెయిల్ అవ్వడంతో.. ప్రభాస్ ఈ సినిమా పై ప్రత్యేక దృష్టి పెట్టాడు.
#Prabhas20, New schedule will start in November. Currently pre production work is in full swing for a big set at Hyderabad.#Prabhas @hegdepooja @director_radhaa #UVCreations
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) October 27, 2019


