సమీక్ష : విశ్వనాథ్ అండ్ సన్స్ – మెప్పించే ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా!

సమీక్ష : విశ్వనాథ్ అండ్ సన్స్ – మెప్పించే ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా!

Published on Aug 14, 2026 9:05 PM IST

విడుదల తేదీ : ఆగస్టు 14, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు : సూర్య, మమితా బైజు, రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్, సుధ, రఘుబాబు, నాజర్ తదితరులు.
దర్శకత్వం : వెంకీ అట్లూరి
సంగీతం : జి. వి. ప్రకాష్ కుమార్
నిర్మాతలు : సూర్యదేవర నాగవంశీ
సినిమాటోగ్రఫీ : నిమిష్ రవి
ఎడిటింగ్ : నవీన్ నూలి

సంబంధిత లింక్స్ : ట్రైలర్

సూర్య ప్రధాన పాత్రలో వెంకీ అట్లూరి తెరకెక్కించిన చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. మమితా బైజు హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్ళి చూద్దాం.

కథ:-

సంజయ్ విశ్వనాథ్ (సూర్య) బిజినెస్ మెన్. అండ్ పిస్టల్ షూటర్ కూడా. అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ కూడా సాధిస్తాడు. ఐతే, 40 ఏళ్ల వయసు ఉన్నప్పటికీ సంజయ్ ఒంటరిగానే ఉంటాడు. అతని తల్లి (రాధిక) పెళ్లి చేసుకోమని బలంవంతం చేస్తూ ఉంటుంది. తల్లి కోసం సంజయ్ సరోగసి ద్వారా బాబుకి జన్మని ఇస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో తన కుమారుడి బాధ్యతలను ఎలా చూసుకున్నాడు. ఈ క్రమంలో కొడుకుకు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ అవసరం కావడంతో మమితా బైజు సంజయ్ జీవితంలోకి ఎలా ఎంట్రీ ఇచ్చింది ?, అసలు ఆమె ఎవరు ?, 22 ఏళ్ల మ్యాడీ (మమితా బైజు) – 40 ఏళ్ల సంజయ్ తో ఎలా ప్రేమలో పడింది?, తన ప్రేమను మ్యాడీ సంజయ్‌కు చెప్పిన తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి?, అసలు సంజయ్, మ్యాడీ ప్రేమను ఒప్పుకున్నాడా? లేదా ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాలో సూర్య చాలా సెటిల్డ్ గా కనిపించాడు. యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్ తోనూ సూర్య మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ.. సూర్య నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని మూమెంట్స్ తోనూ సూర్య సినిమాకే హైలైట్ గా నిలిచాడు. రాధిక శరత్‌కుమార్ పాత్ర చనిపోయాక వచ్చే ఎమోషనల్ సీన్స్ లో అండ్ రవీనా టాండన్ పాత్రతో సాగే సీన్ లోనూ సూర్య నటన చాలా బాగుంది.

హీరోయిన్ గా మమితా బైజు మెప్పించింది. బరువైన భావోద్వేగ సన్నివేశాల్లో కూడా ఆమె చాలా సెటిల్డ్ గా నటిస్తూ ఆకట్టుకుంది. కీలక పాత్రలో నటించిన రాధిక శరత్‌కుమార్ మెప్పించారు. మరో పాత్రలో నటించిన రవీనా టాండన్ కూడా బాగా నటించింది. సుధ, సర్వదమన్ బెనర్జీ, హర్ష చెముడు, మాథ్యూ వర్గీస్, రఘుబాబు, అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.

దర్శకుడు వెంకీ అట్లూరి రాసుకున్న మెయిన్ థీమ్ అండ్ ఎమోషనల్ ఎపిసోడ్స్ అండ్ కొన్ని ఫ్యామిలీ సీన్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా సూర్యకి అతని ఫ్యామిలీకి మధ్య ఉండే బాండింగ్ చాలా బాగుంది. అలాగే, ఫ్యామిలీ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని దర్శకుడు చాలా బాగా తెరకెక్కించాడు.

మైనస్ పాయింట్స్ :

సూర్య పోషించిన సంజయ్ పాత్రను, ఆ పాత్ర తాలూకు ఫ్యామిలీ సెంటిమెంట్ ను బాగా డిజైన్ చేసుకున్న వెంకీ, కొన్ని చోట్ల అంతే స్థాయిలో కొన్ని సీన్స్ రాసుకోలేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల కథనాన్ని ఇంకా ఇంట్రెస్టింగ్ గా రాసుకోవాల్సింది. అలాగే హీరో -హీరోయిన్ మధ్య ప్రేమ కథను ఇంకా బలంగా ఎస్టాబ్లిష్ చేసి చూపించి ఉంటే సినిమాకి ఇంకా ప్లస్ అయ్యేది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు వెంకీ అట్లూరి కొన్ని సన్నివేశాలను యాక్షన్ పరంగా అలాగే ఎమోషనల్ గా బాగా తెరకెక్కించారు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సంగీత దర్శకుడు అందించిన పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే.. అక్కడక్కడ ఉన్న కొన్ని స్లో సీన్స్ ను ఎడిటర్ తగ్గించాల్సింది. నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

తీర్పు :

‘విశ్వనాథ్ అండ్ సన్స్’’ అంటూ వచ్చిన ఈ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ డ్రామాలో.. సూర్య నటన, మెయిన్ థీమ్ అండ్ ఎమోషనల్ సీన్స్ మరియు అలాగే సూర్య పాత్ర తాలూకు ఎమోషన్స్ కూడా బాగున్నాయి. క్లైమాక్స్ కూడా బాగా ఆకట్టుకుంది. ఐతే, కొన్ని సీన్స్ మాత్రం స్లోగా సాగాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో సూర్య నటనతో పాటు సాంకేతిక విభాగం అందించిన మంచి పనితనం, కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి. మొత్తానికి ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు