‘ఇద్దరి లోకం ఒకటే’.. విడుదల తేదీ మారిందా ?

‘ఇద్దరి లోకం ఒకటే’.. విడుదల తేదీ మారిందా ?

Published on Oct 30, 2019 3:00 AM IST

IddariLokamOkate

యంగ్ హీరో రాజ్‌ తరుణ్‌ హీరోగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. జి.ఆర్‌.కృష్ణ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాని న‌వంబ‌ర్ 9న విడుద‌ల చేయాలని ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పుడు విడుదల తేదీని మార్చినట్లు తెలుస్తోంది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ఈ సినిమాను విడుదల చేయాలని దిల్ రాజు డిసైడ్ అయ్యాడట. త్వరలోనే విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు.

ఇక ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన షాలినీ పాండే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే రాజ్ తరుణ్ కు హిట్ వచ్చి చాలా కాలమే అయిపోయింది. గత ఏడాది మూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చినా.. ఒక్క సినిమాతో కూడా ఆకట్టుకోలేకపోయాడు ఈ యంగ్ హీరో. మరి ఈ సినిమాతోనైనా రాజా తరుణ్ కి షాలినీ పాండేకు మంచి హిట్ వస్తోందేమో చూడాలి. మిక్కీ జె.మేయ‌ర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి స‌మీర్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

తాజా వార్తలు