మహేష్ కి నాకు మధ్య ఎలాంటి సవాళ్లు ఉండవు – విజయశాంతి

మహేష్ కి నాకు మధ్య ఎలాంటి సవాళ్లు ఉండవు – విజయశాంతి

Published on Oct 31, 2019 9:43 AM IST

MaheshBabu VijayaShanthi

సూపర్ స్టార్ మహేశ్ బాబు టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’లో ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విజయశాంతి ఈ సినిమాకి సంబంధించి మాట్లాడుతూ ‘‘చాల సంవత్సరాల తరువాత నటిస్తున్నాను. ‘సరిలేరు నీకెవ్వరు’ సెట్ లో టీమ్ అందరూ ఎంతో అభిమానంగా చూస్తున్నారు. ఇక మీడియాలో వస్తోన్నట్లు ఈ సినిమాలో మహేష్ పాత్రకు, నా పాత్రకు మధ్య ఎలాంటి సవాళ్లు ఉండవు. సినిమాలో మా పాత్రల మధ్య రిలేషన్ కూడా చాల బాగుంటుంది.

ఇక ‘కొడుకు దిద్దిన కాపురం’ సినిమాలో మహేష్ తో కలిసి నటించాను. నేను అప్పుడే చెప్పాను. ఈ బాబు సూపర్ స్టార్ అవుతారని. ఇక సెట్ లో కృష్ణగారి లాగే మహేష్ కూడా చాలా సైలెంట్‌ గా ఉంటారు. మహేష్ నన్ను అమ్మా అని.. ఒక్కోసారి మేడం అని పిలుస్తారు. నేను మహేష్ ను బాబు అని.. లేదంటే మీరు అని సంబోధిస్తా. ఏమైనా ఈ సినిమా చేయడం చాల ఆనందంగా ఉంది అని విజయశాంతి చెప్పుకొచ్చారు.

కాగా ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ ముగించుకున్న ఈ సినిమాని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా ప్రత్యేక గీతంలో మెరవనుంది. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు