అక్కినేని అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు హైదరాబాద్లో షూటింగ్ చేసిన ఈ చిత్రం కొత్త షెడ్యూల్ కోసం చాలా దూరమే వెళ్లింది. ఇంతకీ ఏక్కడికనుకుంటున్నారా.. ఎడారి దేశం సౌదీకి. అక్కడే ఒక పెద్ద ఫైట్ సీన్, ఒక రొమాంటిక్ సాంగ్ షూట్ చేస్తారట. వీటికోసం సుమారు 10 రోజుల పాటు అక్కడే ఉండనున్నారట టీమ్.
వరుస పరాజయాల తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని చేస్తున్న ఈ సినిమా మీద అఖిల్ చాలానే ఆశలు పెట్టుకున్నాడు. ఇక దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ సైతం చాన్నాళ్ల తర్వాత చేస్తున్న సినిమాతో నిలదొక్కుకోవాలని గట్టిగా భావిస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమాను బన్నీ వాస్ నిర్మిస్తున్నారు.


