‘రాజావారు రాణిగారు’ వచ్చేది ఎప్పుడంటే…!

‘రాజావారు రాణిగారు’ వచ్చేది ఎప్పుడంటే…!

Published on Nov 3, 2019 1:00 AM IST

Rajavaru

కిరణ్‌ అబ్బవరం, రహస్య గోరఖ్‌ జంటగా నటించిన చిత్రం ‘ రాజావారు రాణిగారు. ఎస్ ఎల్ ఎంటర్టైన్మెంట్స్, మీడియా9 పతాకంపై మనోవికాస్ డీ, మీడియా9 మనోజ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘రాజావారు రాణిగారు’ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధం అయ్యింది. ఒక పక్క నిఖిల్ నటించిన అర్జున్ సురవరం సినిమా విడుదల కూడా అదే రోజున విడుదల కావడం గమనార్హం.

ఆసియన్ సునీల్ అర్జున్ సురవరం రిలీజ్ చేస్తున్నాడు. థియేటర్ల విషయంలో వీరిద్దరూ నిర్ణయిస్తారు. ఇన్సైడ్ టాక్ బాగున్నా ఈ రెండు సినిమాలు కూడా ఒకే డేట్ కి రావటం మంచిదే కానీ, వీకెండ్ కలెక్షన్స్ షేర్ చేసుకొనే అవకాశం కలదు. ఇప్పటికే ఈ రెండు చిత్రాలు నవంబర్ 29న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. రాజా వారి రాణి గారు చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తుండగా జయ్ క్రిష్ సంగీతం అందించారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు