అక్కడ బిగిల్ మూవీ కలెక్షన్స్ లో దుమ్మురేపుతోంది

అక్కడ బిగిల్ మూవీ కలెక్షన్స్ లో దుమ్మురేపుతోంది

Published on Nov 2, 2019 9:00 PM IST

Bigil3

తలపతి విజయ్ మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆయన తాజా చిత్రం బిగిల్ రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 200కోట్ల వసూళ్ల మార్కును దాటివేసింది. తమిళంలో 2019గానూ హైయెస్ట్ గ్రాస్సింగ్ లిస్టులో రెండవ స్థానంలో నిలిచింది. పేట మొదటి స్థానంలో ఉండగా, విశ్వాసం మూవీ మూడవ స్థానానికి పరిమితమయ్యింది. కాగా మలేసియాలో కూడా బిగిల్ మూవీ వసూళ్ళలో దూసుకుపోతుంది. ఇప్పటికే అక్కడ బిగిల్ 15.7 కోట్ల వసూళ్లు రాబట్టిందని సమాచారం. తమిళవారు అధికంగా ఉండే మలేసియాలో కోలీవుడ్ చిత్రాలకు మంచి డిమాండ్ ఉంటుంది.

బిగిల్ చిత్రానికి యంగ్ డైరెక్టర్ అట్లీ దరకత్వం వహించగా, నయనతార ఆయనకు జంటగా నటించింది. ఏ జి ఎస్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఇక విజయ్ తన తదుపరి చిత్రం దర్శకుడు కార్తీక్ కనకరాజ్ తో కమిట్ అయ్యారు. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. విలక్షణ హీరో విజయ్ సేతుపతి ఈ మూవీలో విలన్ గా నటించడం విశేషం.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు