సరిగ్గా మూడు రోజులక్రితం పవన్ కళ్యాణ్ మూవీ చేస్తున్నారంటూ ఒక వార్త బయటికి వచ్చింది. బోనీకపూర్, దిల్ రాజు నిర్మాతలుగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో హిందీ చిత్రం ‘పింక్’ తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. బాలీవుడ్ కి చెందిన ప్రముఖ క్రిటిక్ మరియు ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయం పోస్ట్ చేయడంతో పాటు కొందరు టాలీవుడ్ హీరోలు కూడా ట్వీట్ చేయడం జరిగింది. అలాగే సదరు నిర్మాతలు కానీ, దర్శకుడు కానీ దీనిని ఖండించక పోవడంతో పవన్ రీ ఎంట్రీ ఇక లాంఛనమే అనుకున్నారందరు.
ఐతే మొన్న విశాఖ వేదికగా ఇసుక కొరతపై పవన్ నిర్వహించిన లాంగ్ మార్చ్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు అందరికీ షాక్ ఇచ్చాయి.ఆయన తన ప్రసంగంలో ‘జగన్ పరిపాలన సరిగా ఉంటే… నేను సినిమాలు చేసుకుంటాను’ అన్నారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.ఒకపక్క ఆయన సినీ రంగ ప్రవేశానికి అంతా సిద్ధం అని వార్తలు వస్తున్న నేపథ్యంలో పవన్ ఇలా మాట్లాడరంటే ఆయన సినిమాలలోకి రావడం లేదని సంకేతాలు ఇస్తున్నట్లు అర్థం. ఒక వేళ సినిమా కనుక చేస్తే జగన్ పాలనను బాగుందని ఒప్పుకున్నట్లు అవుతుంది. జగన్ నిర్ణయాలను, పాలనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పవన్ అలా చేస్తారా…?.
ఐతే పవన్ మరో వ్యాఖ్య కూడా చేశారు. ‘నేను సినిమాలలోకి వస్తానో? రానో? తెలియదు కానీ ప్రొడ్యూసర్ గా మాత్రం సినిమాలు నిర్మిస్తాను’ అన్నారు. జగన్ కి కూడా పరిశ్రమలు ఉన్నాయి అన్నారు. నాకు తెలిసింది సినిమా ఒక్కటే, సినిమా చేస్తే తప్పేంటి…? అన్నట్లుఆయన వాదన సాగింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఆయన ఖచ్చితంగా మూవీ చేయను అని చెప్పలేదు.కాబట్టి ఆయన సినిమా చేసే అవకాశం లేకపోలేదు. కానీ పవన్ తన అభిమానులకు తన రీ ఎంట్రీ పై స్పష్టత ఇవ్వకుండా కన్ఫ్యూషన్ లో పెట్టారు.


