‘సామజవరగమన’ షూటింగ్ కోసం పాపులర్ లొకేషన్

‘సామజవరగమన’ షూటింగ్ కోసం పాపులర్ లొకేషన్

Published on Nov 5, 2019 4:53 PM IST

Alav

అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘అల వైకుంఠపురములో’ నుండి వచ్చిన రెండు పాటలు భీభత్సమైన రీతిలో హిట్టయ్యాయి. ముఖ్యంగా ‘సామజవరగమన’ సాంగ్ అయితే విపరీతంగా ఆకట్టుకుని 50 మిలియన్ల వ్యూస్ దాటిపోయింది. ఎక్కడ విన్నా ఈ పాటే వినిపిస్తోంది. ఒక రకంగా సినిమాకు ఇప్పటి వరకు వచ్చిన పాపులారిటీలో సగం ఈ పాటతోనే వచ్చింది.

తమన్ సంగీతం, సిడ్ శ్రీరామ్ గాత్రం, సిరివెన్నెల సాహిత్యం కలగలిసి అద్భుతం అనేలా తయారైన ఈ పాట చూడటానికి ఇంకెంత బాగుంటుందో అనే అంచనాలు మొదలయ్యాయి ప్రేక్షకుల్లో. అందుకే టీమ్ పాటను గొప్పగా చిత్రీకరించాలని సంకల్పించుకుంది. షూటింగ్ కోసం పాపులర్ లొకేషన్ పారిస్ ను ఎంచుకుంది. ఇప్పటికే టీమ్ అక్కడికి చేరుకుంది. ఈ ఆర్భాటం చూస్తుంటే పాట విజువల్ ఫీస్ట్ అనే పేరును కూడా తెచ్చుకుంటుందని అనిపిస్తోంది.

ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇంకా టబు, జయరామ్, నివేత పేతురాజ్ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జనవరి 12న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు