మహేష్ బాబు మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం కానున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా సరైన కథ, దర్శకుడి కోసం వెతికిన గల్లా ఫ్యామిలీ శ్రీరామ్ ఆదిత్యను కొన్ని నెలల క్రితమే ఫైనల్ చేసుకున్నారు. కథను సిద్దం చేసి ఈరోజు కాణిపాకంలోని వరసిద్ది వినాయకుని వద్ద పూజలు నిర్వహించారు.
నవంబర్ 10వ తేదీన ఈ చిత్రం లాంఛ్ కానుంది. ఈ సినిమాను గల్లా పద్మావతి నిర్మించనున్నారు. ఇందులో కథానాయకిగా నిధి అగర్వాల్ చేస్తుందని టాక్. కానీ ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అందాల్సి ఉంది. ఈ చిత్రానికి ఘిబ్రన్ సంగీతం అందివ్వనున్నారు. ఇకపోతే దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య గతంలో ‘భలే మంచి రోజు, దేవదాస్, శమంతకమణి’ వంటి సినిమాల్ని డైరెక్ట్ చేశారు.


