విలక్షణ నటుడు, రచయిత గొల్లపూడి ఇకలేరు..!

విలక్షణ నటుడు, రచయిత గొల్లపూడి ఇకలేరు..!

Published on Dec 12, 2019 1:41 PM IST

ప్రముఖ రచయిత నటుడు గొల్లపూడి మారుతీ రావు నేడు తుది శ్వాస విడిచారు. ఆయన మరణం చిత్ర పరిశ్రమను దిగ్బ్రాంతికి గురి చేసింది. వయో సంబంధిత అనారోగ్యం కారణంగా ఆయన మరణించినట్లు తెలుస్తుంది. దీనితో సినీ ప్రముఖులు ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేశారు. ఇటీవల గొల్లపూడి ఆది హీరోగా వచ్చిన జోడి చిత్రంలో ఒక పాత్ర చేయడం జరిగింది.

రచయితగా తన ప్రస్థానం మొదలుపెట్టిన గొల్లపూడి మారుతీరావు ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమాతో నటుడిగా మారాడు. విలక్షణ నటన , వ్యంగంతో కూడిన డైలాగ్ డెలివరీ ఆయనకు నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. దీనితో దశాబ్దాలపాటు క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, కమెడియన్ గా అనేక పాత్రలు చేశారు. మారుతీ గారు 1939 ఏప్రిల్ 14న విజయనగరంలోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు