మెగాస్టార్ సినిమాలో మీనాక్షి చౌదరి ?

మెగాస్టార్ సినిమాలో మీనాక్షి చౌదరి ?

Published on Aug 10, 2026 7:01 AM IST

మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుంది. చిరంజీవి కెరీర్‌లో 158వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా అప్ డేట్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే, ఈ సినిమాలో మీనాక్షి చౌదరి ఓ పాత్రలో కనిపిస్తోందట. ఐతే, ఆమెది హీరోయిన్ పాత్ర కాదు అని, ఓ గెస్ట్ రోల్ లో మీనాక్షి చౌదరి నటిస్తోందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ కోసం మెగాస్టార్ చిరంజీవి సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడు.

అన్నట్టు ఈ ఫ్లాష్ బ్యాక్ లో మెగాస్టార్ పాత్ర మాఫియా నేపథ్యంలో ఉంటుందట. పైగా ఈ సినిమాలో మెగాస్టార్ పాత్రల్లో చాలా వేరియేషన్స్ ఉంటాయట. అలాగే, ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. చిరును కొత్తగా చూపించాలనే ఉద్దేశ్యంతో ఈ కథ రాసుకున్నారట బాబీ. కాగా ఈ సినిమాని KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వెంకట్ కె నారాయణ, లోహిత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా గతంలో చిరు, బాబీ కాంబినేషన్‌లో వచ్చిన వాల్తేరు వీరయ్య మంచి విజయం సాధించింది.

తాజా వార్తలు