నా ప్రాణం ‘సాయి తేజ్’.. నాకు మాటలు లేకుండా చేసావ్ – తమన్

నా ప్రాణం ‘సాయి తేజ్’.. నాకు మాటలు లేకుండా చేసావ్ – తమన్

Published on Dec 16, 2019 9:03 PM IST

sai dharam tej3

మెగా మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయి తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ప్రతి రోజు పండగే’. తమన్ అందించిన ఈ చిత్రంలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే తమన్, సాయి తేజ్ ఫ్రెండ్ షిప్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. మొదటినుంచీ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. అందుకే సాయి తేజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తమన్ గురించి ఎమోషనల్ గా మాట్లాడాడు.

కాగా తాజాగా తమన్ ఈ విషయం పై స్పందిస్తూ.. ‘ఏం చెప్పాలి ?మాట రాని మౌనం తప్ప..డబ్బు,వ్యాపారం అంటూ స్నేహానికి రంగులు మార్చే ఈ రోజుల్లో, అచ్చమైన స్నేహానికి నిలువెత్తు ప్రతిరూపం ,నా ప్రాణం “సాయి తేజ్”. నీ కోసం ఎప్పుడైనా,ఏదైనా సిద్ధం మిత్రమా..నీ మాటల్తో నాకు మాటలు లేకుండా చేసావ్..నా గుండెని తడి చేసావ్..లవ్ యూ మై డియర్ బ్రదర్’ అని పోస్ట్ చేశారు.

కాగా పల్లెటూరి నేపథ్యంలో సాగే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రానుంది. ఈ చిత్రంలో ధరమ్ తేజ్ సరసన గ్లామర్ డాల్ రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో వీరిద్దరూ “సుప్రీం” సినిమాలో కలిసి నటించడం జరిగింది. ఇక మిగిలిన కీలక పాత్రల్లో సత్యరాజ్, విజయ కుమార్, రావ్ రమేష్, మురళీ శర్మ తదితరులు నటిస్తున్నారు.

తాజా వార్తలు