స్ట్రాంగ్ బుకింగ్స్ తో మూడో రోజు ‘కొరియన్ కనకరాజు’ ర్యాంపేజ్!

స్ట్రాంగ్ బుకింగ్స్ తో మూడో రోజు ‘కొరియన్ కనకరాజు’ ర్యాంపేజ్!

Published on Aug 9, 2026 11:59 PM IST

మెగా యంగ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన కంబ్యాక్ హిట్ చిత్రమే ‘కొరియన్ కనకరాజు’. ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ హారర్ కామెడీ ఎంటర్టైనర్ వరుణ్ తేజ్ కెరీర్ లో మరో సాలిడ్ హిట్ గా నిలిచి తాను ఎంతో కాలంగా కోరుకుంటున్న హిట్ గా నిలిచి అదరగొట్టింది.

ఇలా మొదటి రోజు నుంచే తెలుగు స్టేట్స్ లో సాలిడ్ బుకింగ్స్ ని నమోదు చేస్తూ వచ్చిన ఈ సినిమా ఇప్పుడు మూడో రోజు కూడా సాలిడ్ హోల్డ్ తో బుక్ మై షో లో గంటకి 10 వేలకి పైగా టికెట్ సేల్స్ తో దూసుకెళ్తుంది. దీనితో కొరియన్ కనకరాజు మూడు రోజు వసూళ్లు మరింత ఎక్కువ ఉండొచ్చని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా యంగ్ హీరోయిన్ రితికా నాయక్ వరుణ్ తేజ్ సరసన నటించింది. అలాగే సత్య సాలిడ్ కామికల్ రోల్ లో నటించగా యూవీ క్రియేషన్స్ నిర్మాణం వహించారు.

తాజా వార్తలు