అధికారికంగా ప్రకటించకపోయినా పవన్ కళ్యాణ్ హీరోగా రాబోతున్న పింక్ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. పవన్ ఈ చిత్రం కోసం కేవలం 21 రోజులు మాత్రమే కేటాయించారట. 21 రోజుల్లో తన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసేలా ప్లాన్ చేసుకోమని దర్శకనిర్మతాలకు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక దిల్ రాజు, బోనికపూర్ నిర్మాతలుగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ మూవీ రాబోతుంది.
మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ ను అందిస్తున్నాడు. ఎప్పుడైతే తమన్ రొటీన్ పంథా వదిలి ‘తొలిప్రేమ’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారో అప్పటి నుండి నిర్మాతల చూపు ఆయన మీదే పడింది. ఇక ‘అల వైకుంఠపురములో’ చిత్రం నుండి ‘సామజవరగమన’ పాట బయటికొచ్చిందో అప్పటి నుండి నిర్మాతలు థమన్ మీద గట్టిగా ఫోకస్ పెట్టారు. అలా పవన్ సినిమా రావడంతో థమన్ రేంజ్ ఒక్కసారే పెరిగిపోయింది.
అన్నట్లు ఈ సినిమాలో మిగిలిన కీలకపాత్రలు అయిన ముగ్గురు అమ్మాయిల పాత్రల కోసం.. అంజలి, నివేదా థామస్ మరియు అనన్యలను తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది.


