యంగ్ హీరో రాజ్‌తరుణ్, షాలిని పాండే జంటగా రూపొందుతోన్నలవ్ ఎంటర్‌టైనర్ ‘ఇద్దరి లోకం ఒకటే’. స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మాతగా రూపొందుతున్న చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. జీఆర్.క ష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా సినిమాను డిసెంబర్ 25న విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ – నేను ట్రావెల్ చేస్తున్న సమయంలో ఈ సినిమాలోని పాటలనే వింటున్నాను. చాలా బాగా నచ్చాయి. బ్యూటీఫుల్ మెలోడీస్. మిక్కి జె.మేయర్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ పాటలను, నేపథ్య సంగీతాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. అబ్బూరి రవిగారు చాలా సినిమాలకు బొమ్మరిల్లు నుండి ట్రావెల్ అవుతున్నారు. ఈ సినిమాకు కూడా అద్భుతమైన డైలాగ్స్ ఇచ్చారు. టెక్నికల్‌గా చాలా స్ట్రాంగ్, మంచి కథతో రూపొందిన చిత్రం. థియేటర్ నుండి బయటకు వచ్చే ప్రేక్షకుడికి సినిమాలోని కొన్ని మాటలు, సన్నివేశాలు గుర్తుంటాయి. సమీర్ రెడ్డి.. ఎక్స్‌ట్రార్డినరీ విజువల్స్ ఇచ్చాడు అని అన్నారు.
రైటర్ అబ్బూరి రవి మాట్లాడుతూ – ఈ సినిమా గురించి చెప్పాలంటే స్వచ్ఛమైన ప్రేమకథ అనాలి. మంచి సబ్జెక్ట్. డైరెక్టర్ కృష్ణ ఈ సినిమా కోసం చాలా వెర్షన్స్ రాసుకుని చేశాడు. చివరి 30 నిమిషాలు సినిమాను ప్రేక్షకులు మరచిపోలేరు. సినిమా చాలా చక్కగా వచ్చింది. హృదయాలతో చూసే ప్యూర్ లవ్‌స్టోరీ ఇది అన్నారు.


