పవన్ పింక్ రీమేక్ లో అవి హైలైట్ అట..!

పవన్ పింక్ రీమేక్ లో అవి హైలైట్ అట..!

Published on Dec 18, 2019 7:07 AM IST

Pawan Kalyan

మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీతో పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ కెరీర్ మొదలుపెట్టారు. ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం తరువాత 2014లో పవన్ సొంతగా జనసేన పేరుతో నూతన పార్టీ స్థాపించడం జరిగింది. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సీరియస్ పొలిటీషియన్ గా కొనసాగుతున్నారు. ఐతే పవన్ మరో ప్రక్క సినిమాలలో తన రీ ఎంట్రీకి సిద్ధం అవుతున్నారు.

దిల్ రాజు నిర్మాతగా హిందీ చిత్రం పింక్ రీమేక్ లో ఆయన నటిస్తున్నారు. సోషల్ కాన్సెప్ట్ తో సాగే మెస్సేజ్ ఓరియెంటెడ్ మూవీ కావడంతో ఈ సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ అంగీకరించారు. దర్శకుడు వేణు శ్రీరామ్ పవన్ ఇమేజ్ కి తగ్గట్టుగా ఒరిజినల్ స్క్రిప్ట్ కి మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఈ చిత్రంలో లాయర్ పాత్ర చేస్తున్న పవన్ నుండి పొలిటికల్ సెటైర్స్ ఓ రేంజ్ లో పేలుతాయట.పనిలో పనిగా ప్రస్తుత గవర్నమెంట్స్ ని ఉద్దేశించి ఆయన వేసే సెటైర్స్, పంచ్ డైలాగ్స్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ కలిగించడం ఖాయం అని తెలుస్తుంది.పంచ్ లైన్ డైలాగ్స్ కి ఫేమస్ అయిన పవన్ వేసే పొలిటికల్ సెటైర్స్ అభిమానులకు అలరిస్తాయి అనడంలో సందేహం లేదు.

తాజా వార్తలు