బన్నీ ఫ్యాన్ కి బ్యాడ్ న్యూస్..!

బన్నీ ఫ్యాన్ కి బ్యాడ్ న్యూస్..!

Published on Dec 18, 2019 11:31 AM IST

AlaVaikunthapurramuloo

అల వైకుంఠపురంలో అంటూ సంక్రాంతి పుంజుగా బన్నీ బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా చిత్రంలోని ఒక్కొక్క సాంగ్ విడుదల చేస్తూ వస్తున్నారు. సంగీత దర్శకుడు థమన్ స్వరకల్పనలో ఇప్పటికే వచ్చిన మూడు పాటలు సెన్సేషనల్ హిట్ గా నిలిచాయి. ఇక నేడు అల వైకుంఠపురంలో చిత్రం నుండి ‘బుట్ట బొమ్మ’ అనే సాంగ్ టీజర్ విడుదల చేయాల్సివుండగా అది వాయిదా పడింది. కొన్ని సాంకేతిక కారణాల వలన ‘బుట్ట బొమ్మ’ సాంగ్ టీజర్ నేడు విడుదల చేయలేకపోతున్నామని ఈ మూవీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. దీనితో నేడు ఆ నాలుగవ సాంగ్ టీజర్ చూసి ఎంజాయ్ చేయాలని భావించిన బన్నీ ఫ్యాన్స్ కి నిరాశ ఎదురైంది.

బన్నీ- త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ అలవైకుంఠపురంలో బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. సీనియర్ హీరోయిన్ టబు ఓ కీలక పాత్ర చేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. థమన్ సంగీతం అందించగా వచ్చే ఏడాది జనవరి 12న ఈ చిత్రం విడుదల కానుంది.

తాజా వార్తలు