పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలలో కి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ తెలుగు రీమేక్ లో పవన్ నటిస్తున్నారు. టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరాయి. వచ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ పైకివెళ్ళనుంది. కాగా ఈ చిత్రం ప్రధానంగా ముగ్గురు అమ్మాయిల చుట్టూ తిరిగే సీరియస్ కోర్ట్ డ్రామా. కథలో ఈ ముగ్గురు అమ్మాయిలు కీలకంగా ఉంటారు. కాగా ఆ ముగ్గురు అమ్మాయిలలో ఒక పాత్ర ‘మల్లేశం’ చిత్రంలో ప్రియదర్మి సరసన హీరోయిన్ గా నటించిన అనన్య దక్కించుకుంది.
పవన్ కళ్యాణ్ నటిస్తున్న పింక్ చిత్రంలో నటించే అవకాశం అనన్యను వరించింది. పింక్ లో నటించే ముగ్గురు అమ్మాయిల్లో అనన్య ఒకరు కావడం విశేషం. సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తూనే హీరోయిన్ గా మల్లేశం చిత్రంలో మంచి నటన ప్రదర్శించిన అనన్య, ఇప్పటికే రెండు చిత్రాలు పూర్తి చేసింది. ఫ్లే బ్యాక్ చిత్రంలో 1993 నాటికాలం అమ్మాయిగా నటించి ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. ఈ లోగా పవన్ సినిమాలో నటించే అదృష్టం ఎదురవడంతో ఉబ్బితబ్బిబై పోతుందట అనన్య.


