సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం తన కొత్త చిత్రాన్ని శివ డైరెక్షన్లో మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూట్ ఈరోజు హైదరాబాద్ నగరంలోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. చిత్రీకరణను పాటతో మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఈ షూటింగ్లో రజనీతో పాటు మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్ కూడా పాల్గొన్నారు.
ఇంకొన్నిరోజుల పాటు ఫిల్మ్ సిటీలోనే చిత్రీకరణ జరగనుంది. ఈ చిత్రానికి డి.ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు. రజనీ తొలిసారి శివ డైరెక్షన్లో చేస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. త్వరలోనే సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. ఇకపోతే రజనీ కొత్త చిత్రం ‘దర్బార్’ జనవరి 9న విడుదల కానుంది.


